
యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో కెరియర్ మొదట్లో పోలీస్ పాత్రలతో సూపర్ హిట్ కొట్టిన డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో పిఎస్వి గరుడవేగ సినిమా చేస్తున్నాడు. గుంటూర్ టాకీస్ సినిమా తర్వాత ప్రవీణ్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమా చందమామ కథలు ఆకట్టుకోగా రెండో ప్రయత్నంగా గుంటూర్ టాకీస్ తో అదిరే హిట్ అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం పిఎస్వి గరుడవేగ సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేసింది. జీవిత రాజశేఖర్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ చూసి సాటిస్ఫైడ్ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్ని లియోన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కరెంట్ తీగ సినిమాలో ఓ హాట్ ఐటం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు గరుడవేగలో కూడా హాట్ ఐటంతో కనిపించనుంది. సన్ని చేసే ఈ ఐటం ఎంతటి స్పెషల్ క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి.