అది కేవలం చిరంజీవికే సాధ్యమైంది

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వచ్చిన ఖైది నంబర్ 150తో ఎలాంటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. ఈ సినిమాను రీసెంట్ గా కళాతపస్వి కె.విశ్వనాథ్ చూడటం జరిగింది. ఈ వయసులో కూడా మెగాస్టార్ తన గ్రేస్ ఏమాత్రం తగ్గించలేదని అన్నారు విశ్వనాథ్. చిరుతో స్వయంకృషి, ఆపద్భాందవుడు సినిమాలు తీసిన విశ్వనాథ్ ఈ వయసులో కూడా చిరంజీవి లా నటించే మరో నటుడు లేడని అన్నారు. 

పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా సరే చిరంజీవి స్టామినాలో ఏమాత్రం తేడా రాలేదని తెలుస్తుంది. ఇక సినిమా కలక్షన్స్ లో కూడా ఖైది క్రేజ్ మాములుగా లేదు. ఈ మెగా ఎంట్రీతో రాబోయే సినిమాలకు కూడా ఒక క్రేజ్ తీసుకొచ్చాడు చిరంజీవి. 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.