టాలీవుడ్ కు మరో టబు..!

టాలీవుడ్ లో టబు క్రేజ్ ఎంతో అందరికి తెలిసిందే.. కలయా నిజమా అంటూ అప్పటి కుర్ర కారు హృదయాలను డిస్ట్రబ్ చేసిన టబు ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది. అయితే ఆ తర్వాత అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్నా సరే అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. టబు తర్వాత అంతటి హాట్ ఇమేజ్ ఎవరు సొంతం చేసుకోలేదు. కాని వస్తూ వస్తూనే టబు లాంటి ఫీచర్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది అదితి రావు హైదరి.  

హైదరబాది అమ్మాయే అయిన ఈ అమ్మడు మొదట బాలీవుడ్ లో సత్తా చాటాలని చూసింది. అక్కడ ఎంతకి వర్క్ అవుట్ అవట్లేదని ఇప్పుడు సౌత్ సినిమాల మీద కన్నేసింది. ప్రస్తుతం మణిరత్నం డైరక్షన్ లో చెలియా సినిమాతో తెలుగు తమిళ భాషల్లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు మరో టబు అవుతుందని అంటున్నారు. హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్ని సరిగ్గా ఉండటంతో అమ్మడు సౌత్ లో సూపర్ హీరోయిన్ అవడం ఖాయమని అంటున్నారు.  

తెలుగు అమ్మాయి అయిన ఈ సుందరికి తెలుగు అవకాశాలు ఏమాత్రం వస్తాయో చూడాలి. మణిరత్నం లాంటి స్టార్ డైరక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది అంటే కచ్చితంగా అమ్మడిలో విషయం ఉండే ఉంటుంది. మరి ఈ ముద్దుగుమ్మకి ఏ టాలీవుడ్ డైరక్టర్ తన సినిమా ఛాన్స్ ఇస్తాడో చూడాలి.