విజయ్ మురుగదాస్ మూవీకి ధనుష్ ట్విస్ట్

కోలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రూపొందబోతుంది. మురుగదాస్ డైరక్షన్ లో విజయ్ హీరోగా సినిమా డిస్కషన్స్ లో ఉండగా ఈ సినిమాకు ఇప్పుడు ధనుష్ కూడా జాయిన్ అయ్యాడు. ఏంటి విజయ్, ధనుష్ కలిసి నటిస్తున్నారా అంటే అలాంటిదేం లేదు కాని ధనుష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. ఇప్పటికే తుపాకి, కత్తి సినిమాలతో విజయ్ మురుగదాస్ కాంబో క్రేజీగా మారగా ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమాకు ధనుష్ నిర్మాత అనగానే అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఓ పక్క హీరోగా మంచి ఫాం కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా ధనుష్ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. తను నిర్మాతగా కేవలం తను హీరో సినిమాలే కాకుండా బయట హీరో అది కూడా స్టార్ హీరోని ప్రొడ్యూస్ చేయడం గొప్ప విషయమే. ప్రస్తుతం భైరవ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ ఆ సినిమా తర్వాత అట్లీ డైరక్షన్లో మూవీ చేయబోతున్నాడు.

ఆ రెండు సినిమాల తర్వాత కాని విజయ్ ధనుష్ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మురుగదాస్ సూపర్ స్టార్ మహేష్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.