శాతకర్ణి పతాకోత్సవం..!

నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా జనవరి 12న రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన క్రిష్ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారట. రిలీజ్ ముందు ఈ నెల 8న శాతకర్ణి పతాకోత్సవం చేయబోతున్నారట. శాతకర్ణి రిలీజ్ అయ్యే 100 ప్రత్యేక థియేటర్స్ దగ్గర ఈ శాతకర్ణి పతాకం ఎగురవేస్తారట.

ఈ కార్యక్రమాన్ని బాలయ్య, క్రిష్ లు జనవరి 8న వైజాగ్ లోని జ్యోతి థియేటర్ దగ్గర ఎగురవేస్తారట. ఇక అక్కడ మొదలు పెట్టిన ఆ శాతకర్ణి జెండా ఆవిష్కరణ 100 థియేటర్స్ లో గ్రాండ్ గా ఎరేంజ్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబందించిన విషయాలను నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి దగ్గరుండి చూస్తున్నారట. సంక్రాంతి రేసులో హోరాహోరిగా దిగుతున్న బాలయ్య, చిరుల సినిమాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. 

చరిత్ర కథగా రాబోతున్న శాతకర్ణి ఎన్ని అంచనాలతో వస్తుందో.. అదేవిధంగా ఖైది నంబర్ 150గా మెగాస్టార్ చిరంజీవి కూడా అదే రేంజ్ సంచలనాలతో వస్తున్నాడు. మరి ఏ సినిమా పైచేయి సాధిస్తుందో తెలుసుకోవాలంటే రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.