ఐటి రైడ్స్ షాక్ లో నారా హీరో

నారా రోహిత్ ఇంట్లో సడెన్ గా ఐటి అధికారులు సోదాలు జరుపడం హాట్ న్యూస్ గా మారింది. నారా వారి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన రోహిత్ రీసెంట్ గా అప్పట్లో ఒకడుండేవాడు సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. శ్రీవిష్ణు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మీద ఉన్న నమ్మకంతో నిర్మాతగా కూడా సహకరించిన రోహిత్ సినిమా హిట్ అవడంతో లాభాలు పొందాడట. అంతేకాదు సినిమా నిర్మాణలో భాగమైన ముళ్ళపూడి ప్రశాంతి ఇంట్లో కూడా ఐటి రైడ్ జరిగినట్టు తెలుస్తుంది.

అయితే ఎలాంటి నిరాధార పత్రాలు కాని లేకుండా సవ్యంగానే ఉండటంతో అక్కడ ఏమి రచ్చ జరగలేదట. ఐటి షాక్ తో రోహిత్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నాడని తెలుస్తుంది. సడెన్ గా తన ఇంటి మీదకు ఐటి అధికారులు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటున్నాడు. తను నిర్మించిన సినిమా హిట్ అవడం వల్లే ఇలా రైడింగ్ జరిగిందా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నాడు. ఏది ఏమైనా నారా రోహిత్ మాత్రం అన్ని సవ్యంగా చూసుకుని మంచి పని చేశాడని అంటున్నారు ఫ్యాన్స్.