ఇంట్రెస్టింగ్ కథతో నిఖిల్ కేశవ..!

స్వామిరారా నుండి తన ప్రతి సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నిఖిల్ తాజాగా ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో కూడా కెరియర్ లో మంచి హిట్ అందుకున్నాడు. మధ్యలో శంకరాభరణం ఒక్క సినిమా తప్ప నిఖిల్ హిట్ మేనియా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమా సుధీర్ వర్మ డైరక్షన్లో వస్తున్న కేశవ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందట. 

రివెంజ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోకి గుండె చాతిలో ఎడమపక్కన కాకుండా కుడి పక్కన ఉంటుందట. అయితే ఇలా ఉన్న వారు ఎక్కువ టెన్షన్ కాని.. ఉరకడం కాని చేయకూడదట.. అలా చేయకుండా తన రివెంజ్ ను ఎలా తీర్చుకున్నాడు అన్నది కేశవ కథ అట. అయితే లీక్ అయిన ఈ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే నిజం గా ఈ కథ కేశవదే అయితే కచ్చితంగా మళ్లీ నిఖిల్ ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నట్టు లెక్క.  

స్వామిరారా తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా చేసి ఫ్లాప్ చవిచూసిన సుధీర్ వర్మ ఈ కేశవతో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో సినిమా వస్తేనే కాని చెప్పలేం.