
అసలే పెళ్లి పెటాకులైందని బాధలో ఉన్న మలయాళ భామ అమలా పాల్ కు మరో సమస్య తలనొప్పిగా మారింది. విడాకుల తర్వాత కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్న అమలా పాల్ తన మీద వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో తనకు ధనుష్ కు ఎఫైర్ ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. కేవలం మేము సినిమాల్లోనే నటిస్తున్నాం తప్ప ఎలాంటి రిలేషన్ లేదని అంటుంది.
ధనుష్ నటిస్తున్న వి.ఐ.పి-2 సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమలా మరో సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు. అయితే వరుసెంట ధనుష్ సినిమాలే చేయడం వల్ల అమలా పై ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. డైవర్స్ తర్వాత అమలా కేవలం కోలీవుడ్ లోనే కాకుండా శాండల్ వుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం హెబ్బులిగా రాబోతున్న సుదీప్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అమలా ఆ సినిమాలో తన హాట్ స్టిల్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
ఇక రీ ఎంట్రీలో తెలుగులోనే ఇంకా ఛాన్సులు దక్కించుకోలేదు. అప్పట్లో అల్లరి నరేష్ సినిమాలో అమలా నటిస్తుంది అని వార్తలు వచ్చినా అవి కేవలం గాలి వార్తలే అని తేలింది. మరి అమ్మడు ఇచ్చిన ఈ క్లారిటీ తో ఇప్పటికైనా ఇలాంటి వార్తలు రాయడం మానేస్తారో లేక ఇంకా రెచ్చిపోయి మరి ఆమెను టార్గెట్ చేస్తారా అన్నది చూడాలి.