మనం డైరక్టర్ తో యంగ్ టైగర్..?

13బి సినిమాతో విలక్షణ దర్శకుడిగా అనిపించిన విక్రం కె కుమార్ ఇష్క్, మనం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సూర్య 24 సినిమాతో తన సత్తా చాటినా ఈ డైరక్టర్ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న సెకండ్ సినిమా డైరక్షన్ ఛాన్స్ కొట్టేశాడు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తన ప్రతి సినిమాలో స్పెషాలిటీని చూపించే విక్రం కుమార్ యంగ్ టైగర్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట.

తారక్ కూడా విక్రం డైరక్షన్ నచ్చి కథ ఉంటే చూద్దామని చెప్పాడట. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత బాబి డైరక్షన్లో సినిమా చేస్తున్న తారక్ ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఆ సినిమా తర్వాత విక్రం కె కుమార్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఎన్.టి.ఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ డిఫరెంట్ స్టోరీ డిస్కస్ చేశారట. 

అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రం కుమార్ జూనియర్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడప్పుడే కుదిరే అవకాశం లేదు. అన్ని కుదిరితే 2018లో వీరి సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.