
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ జనవరి 11న భారీగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక జనవరి 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోనున్న ఈ సినిమాకు ముఖ్య అతిధులుగా ఎవరెవరు వస్తారన్న దాని మీద క్లారిటీ వచ్చింది. ఈ విషయం మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్వయంగా డిక్లేర్ చేశారు. దర్శరత్న దాసరి నారాయణ రావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఖైది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్టులుగా వస్తారట.
ఇక ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా తమ ఇన్విటేషన్ పంపించామని.. ఆయన వచ్చేది లేనిది కన్ఫాంగా చెప్పలేమని అన్నారు చరణ్. విజయవాడ-గుంటూర్ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో జరుగబోతున్న ఖైది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా హీరోలంతా సందడి చేసే అవకాశం ఉంది. మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి చూపించేందుకు వస్తున్న ఈ ఖైది అదే రేంజ్ హిట్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఏర్పాటు చేద్దామని అనుకున్నా సెక్యురిటీ దృష్ట్యా అది హాయ్ ల్యాండ్ కు మార్చడం జరిగింది.