ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన దిల్ రాజు

దిల్ రాజు నిర్మాతగా కూడా మంచి కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు. అయితే తన సినిమా రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజు ఏరి కోరి సంక్రాంతికి చిరు బాలయ్య సినిమాలు పోటీ పడుతున్నా సరే తన నిర్మాణంలో శర్వానంద్ హీరోగా వస్తున్న శతమానం భవతి సినిమా రిలీజ్ చేస్తున్నాడు. దిల్ రాజు గట్స్ కు అందరు మెచ్చుకున్నా ఎక్కడో ఓ చోట ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడు అని అందరు అనుకున్నారు.

ఇక ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కరెక్ట్ అనక తప్పదు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ను ఎలా ఎట్రాక్ట్ చేయాలో తెలిసిన దిల్ రాజు సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న శతమానం భవతి సినిమాపై ఉన్న నమ్మకంతోనే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తే సినిమాలో విషయం ఉన్నట్టే అనిపిస్తుంది. 

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న శర్వానంద్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమని చెప్పేయొచ్చు. పోటీ ఎలా ఉన్నా సరే ట్రైలర్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసి థియేటర్ బాట పట్టించే ప్రయత్నంలో దిల్ రాజుతో పాటు చిత్రయూనిట్ కూడా సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరి సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.