మహేష్ బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అట..!

మహేష్ మురుగదాస్ మూవీకి సంబందించి ఎలాంటి అప్డేట్ రాకపోయే సరికి నిరాశలో ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందే. కనీసం ఈ సినిమా టైటిల్ పై కూడా ఓ క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తన డైరక్టర్ ను విష్ చేసిన మహేష్ అతను ఇచ్చిన రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. హ్యాపీ న్యూయర్ సార్ అంటూ ట్వీట్ చేసిన మురుగదాస్ బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అని మెన్షన్ చేశాడు.

గజిని లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన మురుగదాస్ సాధారణంగా తన సినిమాల రిజల్ట్ గురించి తక్కువగా చెబుతాడు. అలాంటిది మహేష్ సినిమా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ అనేయడం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ సినిమాల్లో కెరియర్ బెస్ట్ మూవీగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇక రికార్డుల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. కరెక్ట్ సినిమా పడితే మహేష్ స్టామినా ఏంటో సినిమా కలక్షన్స్ చూసే చెప్పేయొచ్చు. భారీ అంచనాలతో వస్తున్న మహేష్ మురుగస్ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.