పార్ట్-2 అనుకున్న డేట్ కు వచ్చేనా..?

నాలుగు సంవత్సరాలుగా ఓ సినిమా కోసం కష్టపడటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావొచ్చు. బాహుబలి బిగినింగ్ సూపర్ హిట్ అయినా సరే ఇక కన్ క్లూజన్ మీద అంచనాలను అందుకునే ఆ సినిమా తీర్చి దిద్దుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. అసలైతే డిసెంబర్ కల్లా గుమ్మడికాయ కొట్టేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల జరుగలేదట. ఇంకా ప్యాచ్ వర్క్ అలానే ఉందని తెలుస్తుంది. ఇక ఓ పక్క సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

బాహుబలి-2 రిలీజ్ తో చాలా సినిమాల రిలీజ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోని పార్ట్-2 ను అనుకున్న టైం కు తీసుకొస్తారా అన్నది ఆడియెన్స్ ప్రశ్న. అయితే ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా జరిగినంత వరకు గ్రాఫిక్స్, విఎఫెక్స్ పనులు వేగంగానే పూర్తవుతున్నాయట. ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న డేట్ కు రిలీజ్ చేసి తీరాలని చిత్రయూనిట్ ప్లాన్. 

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి పార్ట్-2 ను కూడా అంచనాలను అందుకునేలా భారీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉండేలా ప్రతి సన్నివేశం అద్భుంతగా తీర్చిదిద్దుతున్నారట. మరి అది ఎలా ఉండబోతుంది అన్నది చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.