
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి స్పెషల్ క్రేజ్ తో స్పెషల్ రోల్స్ చేస్తూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది మంజుల. షో సినిమాతో తన అభిరుచిని ప్రేక్షకులకు తెలిసేలా చేసిన మంజుల కొన్ని సినిమాలను నిర్మించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యింది. సందీప్ కిషన్ హీరోగా సాయి మాధవ్ బుర్రా కథ సారధ్యంతో మంజుల సినిమా సినిమా డైరెక్ట్ చేస్తుంది.
ఇన్నాళ్లు కేవలం నిర్మాతగానే అలరించిన మంజుల దర్శకురాలిగా మరో మెట్టు ఎక్కబోతుంది. వరుస సినిమాలు చేస్తున్న ఫ్లాపులను ఎదుర్కుంటున్న సందీప్ కిషన్ ప్రస్తుతం నక్షత్రం సినిమా చేస్తున్నాడు. మంజుల సినిమా కూడా ఈరోజే ఓకే చేశాడట. సో మొత్తానికి మంజుల సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు సందీప్ కిషన్. ఇక ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ గురించి త్వరలో వెళ్లడించే అవకాశాలున్నాయి
మంజుల డైరెక్ట్ చేస్తుంది అంటే సినిమాలో కచ్చితంగా మహేష్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్టే. సో ఈ దెబ్బతో సందీప్ కిషన్ రేంజ్ కూడా స్టార్ హీరో ఇమేజ్ వచ్చేలా సినిమా ఉంటుందేమో చూడాలి.