
మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హీరో మంచు విష్ణు త్వరలో లక్కున్నోడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విష్ణు అడ్డా ఫేం కార్తిక్ రెడ్డి డైరక్షన్లో సినిమా చేస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా మియా జార్జ్ సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టారు.
ఇక ఇప్పుడు ఆ సెకండ్ హీరోయిన్ కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మన్ సినిమాలతో యువతని ఆకట్టుకున్న సురభిని ఫైనల్ చేశారట చిత్రయూనిట్. జెంటిల్మన్ లో సురభిని చూసి ఇష్టపడిన విష్ణు తన సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. బీరువా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సురభి మంచు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అంటే ఇక త్వరలో స్టార్ట్ హీరోయిన్ గా కూడా అవకాశాలు రావడానికి ఆస్కారం ఉన్నట్టే.