
మహానటి సావిత్రి బయోపిక్ సినిమాకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో లీడ్ రోల్ గా ఏ హీరోయిన్ ను తీసుకోవాలనే కన్ఫ్యూజన్ మేకర్స్ మధ్య ఉంది. ఎవడే సుబ్రమణ్యం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాకు కథ అంతా సిద్ధం చేశాడట. ఇక హీరోయిన్ గా నిత్యా మీనన్, విద్యా బాలన్, సమంతల పేర్లు వినిపించాయి కాని ఎవరు ఫైనల్ అయినట్టు చెప్పలేదు. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే మలయాళ భామ కీర్తి సురేష్ మహానటిగా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు.
నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మలయాళ భామ కీర్తి సురేష్ అతి తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈమె మహానటిగా చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ ని మహనాటిగా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. కీర్తి సురేష్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
ఇక మహానటిగా కూడా ఆమె పేరే పరిశీలణలో ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఫాంలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ కూడా కీర్తి సురేష్ స్పీడ్ చూసి కుళ్లుకోవడం ఖాయం మరి మహానటిగా కీర్తి తన అభినయంతో ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.