
తమిళనాడు సిఎం జయలిత బయోపిక్ చేయాలని కోలీవుడ్లో ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె బ్రతికున్నప్పుడే ఈ ప్రయత్నాలు చేయగా లాస్ట్ మంత్ ఆమె మరణించడంతో ఆ ప్రయత్నాలు చేయడం మానేశారు. అయితే టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు జయలలిత బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ కు సరిపడా ఆమె చరిత్రను మలచినట్టు తెలుస్తుంది.
టైటిల్ కూడా అమ్మ అని పెట్టబోతున్నారట. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట దాసరి. అప్పట్లో అమ్మ బయోపిక్ తో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని వార్తలొచ్చాయి. ఒకవేళ దాసరి కూడా త్రిషనే తీసుకుంటాడా లేక వేరే ఎవరినైనా చూస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.
ఎర్రబస్సు తర్వాత సినిమాలను డైరెక్ట్ చేయాలని ఉన్నా సరైన కథ దొరక్క ఖాళీగా ఉన్న దాసరి అమ్మ సినిమా తెరకెక్కించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. మరి తమిళనాడు సంచలన సిఎంగా ప్రస్థానం కొనసాగించిన జలలిత అమ్మ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.