
చిరు సినిమాకు పబ్లిసిటీ కాంట్రాక్ట్ ను వర్మ ఒప్పుకున్నాడా అన్న మాటని నిజం చేస్తూ మెగాస్టార్ 150 మూవీ ఖైది నెంబర్ 150కి సంబందించిన ఏ పోస్టర్ రిలీజ్ అయిన విరుచుకుపడుతున్న ఆర్జివి రీసెంట్ గా సినిమా నుండి రిలీజ్ అయిన చిరు పోస్టర్ పై తన మార్క్ విమర్శలతో టార్గెట్ చేశాడు. కత్తి పట్టుకుని కూర్చున్న స్టిల్ చూసి ఈ ఫొజు డిజైన్ చేసిన డిజైనర్ కు డైక్టర్ కాళ్లకు దండం పెట్టాలని అన్న వర్మ ఈ ఫోజు వచ్చేందుకు సహకరించిన టీం అందరి ఫోన్ నెంబర్ లు తనకు కావాలని అన్నారు.
ఇక ఈ డిజైనర్ కు మాత్రం చరిత్రలో కొన్ని పేజీలుంటాయంటూ ట్వీట్ చేసిన వర్మ మొత్తానికి ఆ పోస్టర్ మీద తన కసి తీర్చుకున్నాడు. పోస్టర్ వర్మ చెప్పినంత గొప్పగా ఏం లేదు అంటే కచ్చితంగా దాన్ని విమర్శిస్తున్నట్టే లెక్క. ఇలా చిరు సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ వర్మ ఇస్తున్నా మరి ఇంతలా చిరుని టార్గెట్ చేయడం మాత్రం ఫ్యాన్స్ కాస్త నిస్సహాయంగా ఉన్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఖైది నెంబర్ 150 మూవీని వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.