
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. రీసెంట్ గా త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నితిన్ నిర్మాతలుగా మారారు. ఆ సినిమా కాకుండానే ఇప్పుడు త్రివిక్రం సోలోగా నందిని రెడ్డి డైరక్షన్లో మూవీకి సమర్పకుడిగా ఉండబోతున్నాడట. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ వారి రెండో నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ పతాకంలో నందినిరెడ్డి సినిమా వస్తుంది.
పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం నిర్మించడం విశేషం. అలా మొదలైందితో హిట్ అందుకున్న లేడీ డైరక్టర్ నందిని రెడ్డి ఆ తర్వాత తీసిన జబర్దస్త్ తో అపవాదాలు మూటకట్టుకున్నా లాస్ట్ ఇయర్ వచ్చిన కళ్యాణ వైభోగమే సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటుకుంది. ఇక రాబోతున్న సినిమా కూడా త్రివిక్రం నిర్మాణంలో కాబట్టి హిట్ లెక్కలో వేసుకోవచ్చు. నిర్మాతగా మారడమే కాదు ప్రతిభ గల దర్శకులకు అవకాశాలిస్తున్న త్రివిక్రం దర్శకుడి గానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.