జూనియర్ తో శ్రీదేవి క్రేజీ కాంబినేషన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి చేస్తున్న బాబి సినిమా గురించి ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడంటూ వార్తలు రాగా ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ లో టాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి నటించబోతుందట. టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన శ్రీదేవి ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. చాలా రోజుల తర్వాత సౌత్ లో అది కూడా కోలీవుడ్ లో చేసిన విజయ్ పులి ఫ్లాప్ అయ్యింది. 

బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ హీరోయిన్ అవసరమట. ఆ క్యారక్టర్ కోసం బాబి శ్రీదేవిని కలిసి డిస్కస్ చేశాడట. ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. ఒకవేళ శ్రీదేవి ఓకే అంటే కనుక తారక్ తో శ్రీదేవి అది ఎలాంటి పాత్ర అయినా సరే ఆ కాంబినేషన్ తెర మీద చాలా అందంగా ఉంటుంది. తాతతో జతకట్టిన ఆమె తర్వాత మనవడితో సినిమా చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు.     

కెరియర్ లో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఫ్లాపుల్లో ఉన్నా సరే బాబి చెప్పిన కథ నచ్చబట్టే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. మరి కాస్టింగ్ విషయంలో వస్తున్న వార్తలన్ని నిజమా కాదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.