తారక్ తో త్రివిక్రం సర్వం సిద్ధం..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. కాటమరాయుడు సెట్స్ మీదుండగా ముహుర్తం పెట్టుకున్న త్రివిక్రం మూవీ వచ్చే నెలలో స్టార్ట్ అవనుందట. అయితే ఎప్పటినుండో జూనియర్ తో సినిమా చేసేందుకు సిద్ధమే అంటూ చెప్పుకొచ్చిన త్రివిక్రం ఎట్టకేలకు తన తర్వాత సినిమా తారక్ తో చేస్తున్నాడట. ఎన్.టి.ఆర్ కూడా త్రివిక్రంతో చేయాలని ఎప్పటినుండో చూస్తున్నాడు.

ఇప్పటికి ఆ ఇద్దరు కలిసి చేసే టైం వచ్చిందని తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా చేసేలోపు బాబి డైరక్షన్లో సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట తారక్. మరి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. త్రివిక్రంతో తారక్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను అందుకునే సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి.