2016 టాలీవుడ్ రివ్యూ : కటౌట్ కాదు కంటెంట్ ఉంటేనే హిట్

2016కు నేటితో గుడ్ బై చెప్పేయబోతున్నాం.. ఇక ఈ ఇయర్ టాలీవుడ్ రివ్యూ చూస్తే కంటెంట్ ఉన్న సినిమాకే ఆడియెన్స్ పట్టం కట్టారని తెలుస్తుంది. పెద్ద సినిమాలేమో ఊహించని రేంజ్లో లేకపోగా చిన్న సినిమాలేమో అంచనాలను మించి కలెక్ట్ చేశాయి. 2016లో ఎన్నో సంచలనాలు సృష్టించాయి చిన్న సినిమాలు. ఇక స్టార్ సినిమాకు కొన్ని నిరాశ పరచినా మరికొన్ని మాత్రం వారి స్టామినా ఏంటో చూపించాయి.

జనవరి 1న నేను శైలజతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ మొదలు పెట్టిన 2016 హిట్ మేనియా డిసెంబర్ 30న అప్పట్లో ఒకడుండేవాడు పాజిటివ్ టాక్ వరకు బాగానే సాగింది. ఇక ఇందులో స్టార్ హీరోల సినిమాలు తక్కువే అని చెప్పాలి. ఈ ఇయర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరక్షన్లో వచ్చిన జనతా గ్యారేజ్ అయితే ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. కొద్దికాలంగా స్టార్ రేసులో వెనుకపడి ఉన్న తారక్ ను ఒక్కసారిగా మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టేలా చేసింది గ్యారేజ్ సినిమా.   

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ :


ఇక ఈ ఇయర్ సమ్మర్ లో సరైన హిట్ అందించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బోయపాటి శ్రీను డైరక్షన్లో వచ్చిన సరైనోడు సినిమా సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అనాల్సిందే. సినిమా సినిమాకు తన పరిధి దాటుకుని వెళ్తున్న బన్ని సినిమాతో హయ్యెస్ట్ కలెక్ట్ టాప్ 5 మూవీస్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించాడు. 

సరైనోడులో అల్ల్ అర్జున్ :


ఇక వయసు ఎంత మీద పడుతున్నా సరే ఈతరం కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలకు తన సత్తా చూపిస్తున్నాడు సోగ్గాడు అదేనండి కింగ్ నాగార్జున. ఈ ఇయర్ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చిన నాగార్జున ఏకంగా 50 కోట్ల షేర్ సాధించి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాడు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున :


ఇక ఈ ఇయర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ సినిమా కూడా సూపర్ హిట్ ఖాతాలో చేరింది. తమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమాలో కొత్త చరణ్ ను చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు కిక్ డైరక్టర్. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చెర్రి సత్తా చాటిన ఈ సినిమా తనకు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటించిన మొదటి సినిమాగా క్రేజ్ తెచ్చిపెట్టింది.

సత్తా చాటిన చిన్న సినిమాలు :


ఈ ఇయర్ ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద విజయాలను అందుకున్నాయి. వాటిలో ముందుగా పెళ్లిచూపులు మూవీ ముందు ఉంది. లో బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా హిట్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా మిలియన్ మార్క్ కలక్షన్స్ దాటి చిన్న సినిమా సత్తా చూపించింది. 

క్షణం అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను అందించారు నిర్మాత పివిపి. రవికాంత్ పారెపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బడ్జెట్ కోటి మాత్రమే కాని ఈ సినిమా కలక్షన్స్ మాత్రం అదరగొట్టాయి. 

నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ ముచ్చటగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. కృష్ణ్గగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మెన్, మజ్ను.. మూడు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలు వచ్చేలా చేశాయి. మూడిట్లో కృష్ణగాడి వీర ప్రేమ గాథ కాస్త బాగా ఆడింది.  

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటించిన సుప్రీం సినిమా కూడా ముందు మాములు టాక్ వచ్చినా ఓవరాల్ గా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి ఈడోరకం ఆడోరకం మూవీ కూడా హిట్ అందుకుంది.  అంతేకాదు ఈ ఇయర్ లాభాలు తెచ్చిన సినిమాలు ఎక్స్ ప్రెస్ రాజా, జ్యో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే, ఊపిరి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, శ్రీరస్తు శుభమస్తు, 24 సినిమాలు ఉన్నాయి.

ఈ ఇయర్ అంచనాలను మించి డబ్బింగ్ సినిమా అయినా పాతిక కోట్ల కలక్షన్స్ తో డబ్బింగ్ సినిమాల్లోనే సరికొత్త సంచలనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. విజయ ఆంటోని నటించిన ఈ సినిమా తెలుగులో వంద రోజులు ఆడింది. తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గ సినిమా వస్తే అది ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది.  

బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోని :


సో ఈ ఇయర్ స్టార్ హీరోల సినిమాలు ఒకటి రెండు నిరాశ పరచినా కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం మంచి రిజల్ట్ అందించారు.