
యూత్ ఐకాన్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాను తన మ్యూజిక్ తో సగం హిట్ చేసే దేవి టాలీవుడ్ ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ అంటే ఒప్పుకోవాల్సిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఓ సినిమా మ్యూజిక్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అన్నది తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ బయట పడలేదు. ఫిల్మ్ నగర్ లో మాత్రం దేవి మ్యూజిక్ అంటే మూడు కోట్లు పెట్టాల్సిందే అంటున్నారు.
దాదాపు ఓ మినిమం హీరో రెమ్యునరేషన్ తన మ్యూజిక్ కోసం డిమాండ్ చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. టాలీవుడ్ లో ఈ రేంజ్లో డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరక్టర్ దేవి ఒక్కడే. ప్రపంచాన్ని తన మ్యూజిక్ తో ఊగిసలాడేలా చేస్తున్న ఏ.ఆర్. రెహమాన్ సినిమాకు 5 కోట్ల దాకా తీసుకుంటాడట. మరి కేవలం తెలుగు తమిళంలోనే చేస్తూ దేవి శ్రీ ప్రసాద్ ఈ విధంగా డిమాండ్ చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు.
తన మ్యూజిక్ చేసే మ్యాజిక్ తో సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాడు కాబట్టే దేవి శ్రీ ప్రసాద్ కు అంత డిమాండ్. దేవితో పాటుగా ఎస్.ఎస్.తమన్, అనూప రూబెన్స్ మంచి క్రేజ్ మీదున్నారు.. అయితే వీరికి మహా అయితే 50 లక్షల నుండి 1 కోటి దాకా ఇస్తారేమో కాని అంతకుమించి ఎక్కువ ఉండే ఆస్కారం లేదని తెలుస్తుంది.