నాగార్జున మరో మల్టీస్టారర్

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సుధీర్ వర్మ డైరక్షన్లో కేశవ అని రాబోతున్నాడు. అయితే అదే కాకుండా కార్తికేయ డైరక్టర్ చందు మొండేటి డైరక్షన్లో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున మెయిన్ లీడ్ కాగా నిఖిల్ కూడా నటిస్తున్నాడట. సో నాగార్జున, నిఖిల్ మల్టీస్టారర్ సినిమా చూడబోతున్నామన్నమాట. ఈ ఇయర్ ఊపిరితో మల్టీస్టారర్ కు కొత్త క్రేజ్ తెచ్చిన నాగ్ ఇప్పుడు నిఖిల్ తో చేసేందుకు సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ అవగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఓం నమో వెంకటేశాయ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న నాగార్జున ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా షూట్లో పాల్గొంటారట. ఇక నిఖిల్ కేశవ సినిమా కూడా సెట్స్ మీద ఉంది కాబట్టి అది పూర్తి చేసి నాగ్ సినిమా చేయనున్నాడు. కార్తికేయ తర్వాత నాగ చైతన్యతో ప్రేమం రీమేక్ చేసి హిట్ అందుకున్న చందు డైరక్షన్లో సినిమా అంటే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకునేలా చేశాడు.

సో మొత్తానికి మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెర మీద చూడబోతున్నాం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తారట. సినిమా ముహుర్తం మిగతా స్టార్ట్ కాస్ట్ విషయాలన్ని త్వరలో తెలియపరిచే అవకాశాలున్నాయి.