
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ సంక్రాంతి బరిలో వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ మెప్పు పొందిందని అంటున్నారు. సెన్సార్ వాళ్లు చిరు సినిమా చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించారట. మొత్తం 18 మందితో కూడిన సెన్సార్ టీం ఖైది నెంబర్ 150 మూవీ చూశారట. సినిమా చూసిన వీరు క్లాప్స్ కొట్టారని టాక్.
స్టార్ హీరోల సినిమాల సెన్సార్ టాక్ బయటకు రావడం మాములే. అయితే ఇదో పబ్లిసిటీ స్టంట్ అనే టాక్ కూడా ఉంది. ఖైది సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించారు. జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరుగనుంది. సెన్సార్ మెప్పు పొందిన చిరు మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
తమిళ కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా వినాయక్ డైరక్షన్ లో వస్తుండగా కాజల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్ అన్ని ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.