
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా న్యూ ఇయర్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. డాలి డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ కానుకగా పవర్ స్టార్ నడుస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. పంచెకట్టుతో పవర్ స్టార్ కేక పెట్టిస్తున్నాడు. రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ లుక్ రివీల్ కాకున్నా సరే పోస్టర్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.
ఇక ఫుల్ పోస్టర్ జనవరి 1న రిలీజ్ చేస్తారట. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. పంచె కట్టుతో పవర్ స్టార్ ఫుల్ పిక్చర్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా 1న రిలీజ్ చేస్తారట. ఇక రానున్న 2017 మెగా నామ సంవత్సరం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే సంక్రాంతి రేసులో మెగాస్టార్ ఖైది నెంబర్ 150 వస్తుండగా.. ఉగాదికి కాటమరాయుడు రెడీ అవుతాడట. ఇక సమ్మర్ లో మరోసారి తన సరైన సత్తా చూపించడానికి దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు అల్లు అర్జున్. సో మొత్తానికి వచ్చే ఏడాది మెగా హీరోల క్రేజీ సినిమాలతో ఫ్యాన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నారు.