
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని పక్కన సపోర్టెడ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన పెళ్లిచూపులు మూవీ విజయ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆరు సినిమాల్లో అవకాశం దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రాంతి మాధవ్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడట. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్న క్రాంతి మాధవ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ మూవీ అంటే కచ్చితంగా లక్కీ ఛాన్స్ అన్నట్టే.
ఇక ఈ సినిమాను కె.ఎస్.రామారావు నిర్మిస్తారని తెలుస్తుంది. మళ్లీ మళ్లీ రాని రోజు సినిమా కూడా అతని నిర్మాణ సారధ్యంలోనే వచ్చింది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే క్రాంతి మాధవ్ విజయ్ తో కన్ ఫాం చేశాడు. మరి యువ హీరోల్లో ఒక్క సినిమాతో తన ఫేట్ మార్చుకున్న విజయ్ అదే విధంగా కథల విషయంలో కూడా మంచి టేస్ట్ ఫుల్ గా ముందుకు కొనసాగుతున్నాడు. మరి క్రాంతి మాధవ్ తో విజయ్ ఎలాంటి సినిమా తీస్తాడో తెలుసుకోవాలంటే ఆ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.