
మైక్ దొరికితే స్టార్ హీరో గురించి అతని టాలెంట్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడటం కామనే. రీసెంట్ గా జరిగిన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఖబడ్దార్ అంటూ మాట్లాడాడు ఆ మూవీ డైరక్టర్ క్రిష్. అయితే ఈ చాలెంజ్ సంక్రాంతి బరిలో పోటీగా దిగుతున్న ఖైది నెంబర్ 150 సినిమా గురించి అనుకుని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మెగాస్టార్ సినిమాను ఖబడ్దార్ అనేంత సీన్ క్రిష్ కు వచ్చిందా అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఆ వార్తలు ఆనోటా ఈనోటా పడి క్రిష్ చెవిన పడ్డాయి. వెంటనే తాను చాలెంజ్ చేసింది తెలుగుని తక్కువ చేసి చూస్తున్న తెలుగువారికి తప్ప మెగాస్టార్ సినిమాకు కాదని.. అల్లు అర్జున్ తో వేదం, వరుణ్ తేజ్ తో కంచె సినిమాలు తీసిన తనకు మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవమని. తన ప్రతి సినిమా విషయంలో మెగాస్టార్ ఆశీస్సులు ఉంటాయని స్పందించాడు క్రిష్. కేవలం ఆ స్టేజ్ మీద కబడ్దార్ అన్న మాటకు బాలయ్య డైరక్టర్ ఇలా చిరుకి విన్నవించుకోవాల్సి వచ్చింది.
మరి మైకు దొరికినప్పుడు వాయించడం దేనికి మళ్లీ ఇలా క్షమాపణలు అడగడం దేనికని కొందరు అనుకుంటున్నారు. సంక్రాంతికి ఖైదిగా తన సత్తా చాటాలని చూస్తున్న చిరుకి బాలయ్య తన శాతకర్ణి మూవీతో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.