పవర్ స్టార్ తో కన్ఫాం చేసిన కుష్బూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో తాను ఉన్నట్టుగా కన్ఫాం చేసింది కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ కుష్బూ. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన ఆమె డైరక్టర్ సుందర్ ను పెళ్లాడింది. అయితే కొద్దిరోజులుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న కుష్బూ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 9 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ అక్క రోల్ లో కనిపించిన్న కుష్బూ మళ్లీ తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుంది. 

త్రివిక్రం సినిమాలో తన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పింది కుష్బూ. అయితే ఈ పాత్ర అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రలానే అత్త క్యారక్టర్ అయ్యుంటుందని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంగీత కెరటం అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రం పవన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తుందని టాక్.