జూనియర్ సినిమాపై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమాపై రోజుకో రూమర్ హల్ చల్ చేస్తుంది. బాబి డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో త్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ సినిమా టైటిల్ గా నట విశ్వరూపం అని పెట్టబోతున్నారట. అయితే ఈ టైటిల్ పై ఫ్యాన్స్ నుండి నెగటివ్ కామెంట్స్ రావడంతో కన్ ఫ్యూజన్ లో పడ్డారట. ఇక రీసెంట్ గా కళ్యాణ్ రాం మీడియాతో మాట్లాడగా సినిమాపై వస్తున్న వార్తలన్ని రూమర్సే అని కొట్టిపడేశాడు.  

ఇంతవరకు సినిమా ఫైనల్ కాస్టింగ్ ఓకే కాలేదని.. ఇక టైటిల్ అయితే పరిశీలణకే రాలేదని అన్నారు. తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ముగ్గురు భామలను సెలెక్ట్ చేశారట. తారక్ మూడు విభిన్న పాత్రల్లో విశ్వరూపం చూపించే అవకాశాలున్నా టైటిల్ పై మాత్రం వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మళ్లీ చిత్రయూనిట్ సందిగ్దంలో పడింది.

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా తన బ్యానర్లో సూపర్ హిట్ గా నిలుస్తుందని నమ్ముతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుందట.