హీరోగా మొదటి ప్రయత్నం కన్నీళ్లు పెట్టించిందా..!

కమెడియన్ నుండి హీరోగా ప్రమోషన్ కొట్టేసిన సప్తగిరి రీసెంట్ గా తను నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా రొటీన్ పంథాలో నడిచినా అక్కడక్కడ ఆడియెన్స్ ను టచ్ చేసే పాయింట్స్ తో మంచి వసూళ్లను సాధిస్తున్నాడు. ఇక సినిమా సక్సెస్ లో భాగంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోగా ఆ సక్సెస్ మీట్ లో సప్తగిరి ఎమోషనల్ స్పీచ్ తో కన్నీళ్లు పెట్టాడు.   

తాను హీరోగా చేసిన ఈ ప్రయత్నాం రొటీన్ కథే అయినా ప్రేక్షకులు నచ్చారని అన్న సప్తగిరి తన సినిమా రివ్యూ తప్పుగా రాసిన వారి మీద ఫైర్ అయ్యాడు. ఇంట్లో 60 ఏళ్ల తల్లిదండ్రులు కొడుకు సంతోషం కోరుకుంటారని.. మీ రాతలతో వారిని ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నాడు సప్తగిరి. మన ప్రయాణం ఇంకా కొనసాగాల్సి ఉందని అన్న సప్తగిరి మీకు కుటుంబాలు లేవా వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకోరా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  

సప్తగిరి ఈ వ్యాఖ్యలు చేసింది తన సినిమాకు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చిన వారి మీద అని తెలుస్తుంది. పేరు చెప్పలేదు కాని ఫలానా వాళ్లు తన సినిమాను తొక్కేశారు అన్న రీతిలో మాట్లాడాడు సప్తగిరి. అయితే ఇలాంటి రివ్యూలు హీరోగా చేసిన మొదటి సినిమా కాబట్టి తాను జీర్ణించుకోలేకపోయాడు సప్తగిరి. స్టార్ హీరో సినిమా అయినా సరే చెడుగుడు ఆడే రివ్యూ రైటర్స్ సప్తగిరి సినిమా వదులుతారా చెప్పండి. సినిమా బాగుంటే బాగుందని.. లేదంటే లేదని చెప్పే ఈ వృత్తిలో ఇలాంటి సెంటిమెంట్స్ ఎలా వర్క్ అవుట్ అవుతాయో సప్తగిరికే తెలియాలి.