వర్మ కొత్త టైటిల్ 'దేవినేని'

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వంగవీటి సినిమా మీద వస్తున్న వ్యతిరేకత పూర్తి కాక ముందే ఇప్పుడు కొత్తగా దేవినేని అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది. రెండు కుటుంబాల కథ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడట. వంగవీటి సినిమాతోనే నిప్పు రాజేసిన వర్మ ఇప్పుడు మళ్లీ దేవినేనితో మరో సంచలనం సృష్టించనున్నాడు. టైటిల్ చూస్తే ఇది కూడా విజయవాడ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది.

ఇప్పటికే వంగవీటి ద్వాతా ఆ వర్గపు ఫ్యాన్స్ తో ఓ రేంజ్ బెదిరింపులు వస్తుండగా అవేవి పట్టించుకోకుండా వర్మ మళ్లీ దేవినేని అనే సినిమా తీయడం తన గట్స్ ఏంటో తెలుస్తుంది. వర్మ వర్సెస్ వంగవీటి హాట్ హాట్ గా నడుస్తున్న డిస్కషన్స్ కూడా అందరికి తెలిసిందే. వంగవీటి సినిమాలో రంగని కాస్త తక్కువ చేసి చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చేయబోయే దేవినేని సినిమా కూడా ఆర్జివి అలానే చేస్తాడా అన్నది ఇక్కడ హాట్ న్యూస్ అయ్యింది.

అయితే కొందరు మాత్రం వంగవీటి న్యూస్ నుండి డైవర్ట్ చేసేందుకు దేవినేని సినిమా అంటూ షో చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సినిమాల వల్ల వర్మకు ఎప్పుడు లేని వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాస్తో కూస్తో జాగ్రత్త పడితే మంచింది.