
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమాలో రంగ గురించి సరిగా చూపించలేదని అతన్నో రౌడిగా చూపించారని రిలీజ్ అయిన నాటి నుండి వస్తున్న వ్యతిరేకత తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ విలన్ డైరక్టర్ జివి సుధాకర్ నాయుడు ఓ సెన్షేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వంగవీటి ఒరిజినల్ కథతో తాను సినిమా చేస్తానని దమ్మున్న మగాడెవడైనా సరే అపండి చూస్తా అని అన్నారు.
వంగవీటి సినిమా రిలీజ్ ముందు వర్మ కొన్ని సీన్స్ తనకు చూపించారని కాని సినిమాలో మాత్రం తేడా కొట్టిందని అన్నారు. పాతిక సంవత్సరాల పైన చనిపోయిన రంగకు మారుమూల గ్రామాల్లో కూడా అభిమానులుండటం గొప్ప విషయమని తన సొంత డబ్బుతో పాతిక కోట్లు అయినా సరే వంగవీటి రంగ మీద జరిగిన కథను జరిగినట్టుగా పేర్లను కూడా వదలకుండా సినిమా తీస్తా అని అన్నారు జివి. సుధాకర్ నాయుడు.
తునిలో ఫంక్షన్ కు వెళ్లానని తన మీద ఆరు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. ఈ సినిమా తీస్తే అరెస్ట్ చేసినా సరే తాను జైలుకి వెళ్లేందుకు సిద్ధమే అని అన్నారు. మరి జివి విసిరిన ఈ చాలెంజ్ కు ఎటునుండి సమాధానం వస్తుందో చూడాలి.