షారుఖ్ కు డాక్టరేట్..!

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అందించారు. బాలీవుడ్ క్రేజీ స్టార్ గా షారుఖ్ ఎదిగిన తీరు అందరికి తెలిసిందే. ఇక ఈ డాక్టరేట్ అందుకున్న సంతోషంలో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ తన తల్లి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిందని. అలాంటి హైదరాబాద్ గడ్డపై డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి స్వాతంత్య సమరయోదుడని.. ఉర్దూ భాష అంటే ఏంటో అభిమానమని అన్నారు.  

జీవితంలో ముందుకెళ్లాలంటే కొన్ని సార్లు వెనక్కి తప్పదన్న షారుఖ్ తప్పు చేయడం కన్నా అది జరగకుండా ముందే జాగ్రత్త పడటం మంచిందని అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చాన్సలర్ జాఫర్ సర్వేష్ వాలా షారుఖ్ కు డాక్టరేట్ అందించారు. తనకు ఈ డాక్టరేటు ఇచ్చినందుకు షారుఖ్ యూనివర్సిటీ వారికి తన కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో రాయీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షారుఖ్ ఆ సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాలనుకుంటున్నాడు.