మహేష్ డేటింగ్ విషయాలను బయటపెట్టిన జయంత్..!

సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క స్టార్ క్రేజ్ తో దూసుకుపోతున్నా మరో పక్క తన ఫ్యామిలీతో ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంటాడు. అయితే మహేష్ డేటింగ్ విషయాల గురించి ఓ డైరక్టర్ మాట్లాడటం ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయ్యింది. మహేష్ తో టక్కరిదొంగ సినిమా తీసిన జయంత్ సి పరాంజి మహేష్ డేటింగ్ విషయాలను బహిర్గతం చేశాడు. ప్రేమించుకుందా రా.. ప్రేమంటే ఇదేరా తరహాలో మహేష్ ఓ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నాడు కాని టక్కరి దొంగ చేయాల్సి వచ్చింది. 

ఇక ఆ సమయంలో మహేష్ నమ్రతలు డేటింగ్ లో ఉన్నారని అందుకే తాను ప్రేమ కథ తీయలేకపోయానని అంటున్నాడు జయంత్. తీసిన కొన్ని సినిమాలకే లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయంత్ సి పరాంజి త్వరలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో జయంత్ మహేష్ డేటింగ్ విషయాలను బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు మహేష్ నమ్రతలకు గౌతం, సితార పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

సైలెంట్ గా కనిపించే మహేష్, నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ చేశాడా అన్న డౌట్ రాకమారదు. ఇద్దరు కలిసి వంశీ సినిమాలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి కలిసి జీవితాన్ని పంచుకునేలా చేసింది.