ఎన్టీఆర్ 'నట విశ్వరూపం'.. నచ్చలేదంటున్న ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత మూడు నెలలు టైం తీసుకుని ఫైనల్ గా బాబి డైరక్షన్లో సినిమాకు ఓకే చెప్పాడు. సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ సినిమా టైటిల్ గా నట విశ్వరూపం అని పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. బాబి చెప్పిన ఈ టైటిల్ విషయంలో సందిగ్ధంలో పడ్డాడు తారక్. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన విశ్వరూపం సినిమా ఫ్లాప్ అయ్యింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు తీసిన ఆ సినిమా టైటిల్ గ్రాండ్ గా ఉన్న సినిమా నిరాశ పరచింది.   

ఇప్పుడు తారక్ కూడా నట విశ్వరూపం అని వస్తే మళ్లీ అదే రిజల్ట్ వస్తుందని భయపడుతున్నారు. అందుకే నట విశ్వరూపం టైటిల్ వద్దు అన్నది వారి కామెంట్. అదుర్స్ సినిమాలో డ్యుయల్ రోల్ తో అలరించిన తారక్ ఈ సినిమాలో ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 40 కోట్ల దాకా ఉంటుందట. ఇప్పటికే ముహుర్తం పెట్టుకున్న చిత్రయూనిట్ త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి తారక్ నట విశ్వరూపం చూపిస్తాడా లేక వేరే టైటిల్ ఏమన్నా చూస్తా అన్నది తెలియాల్సి ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత్ ఫ్లాప్ డైరక్టర్ అయినా సరే తను చెప్పిన కథ నచ్చి బాబి డైరక్షన్లో సినిమా తీస్తున్నా తారక్. పిలిచి మరి అవకాశం ఇచ్చిన తారక్ కు బాబి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.