
మంచి సినిమాలకు మీడియా ఎంకరేజ్ మెంట్ కూడా ఉంటుంది. డిమానిటైజేషన్ లో కూడా మా సినిమా ఇంత బాగా ఆడిందంటే అది మీడియా వల్లే అంటూ.. వాళ్లు ఇచ్చిన రేటింగ్ రాసిన ఆర్టికల్స్ సినిమాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే మీడియా వారికి ఓ సెల్యూట్ అని ధ్రువ థాంక్స్ మీట్ లో మీడియాను ఉద్దేశించి అన్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.
ఇక తన స్టాడం గురించి కూడా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశాడు చెర్రి. సీటు కాపాడుకోడానికో.. నెంబర్ గేమ్ కోసమే అయితే చాలా సినిమాలు చేసే వాడిని.. ఓసారి మణిరత్నం గారిని కలిస్తే నీకున్న స్టార్డం తో ప్రయోగాలు చేయ్యమని చెప్పారని అందుకే ధ్రువ చేశానని అన్నారు చరణ్. సో మొత్తానికి చరణ్ ఇప్పుడు ఓ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు. దాదాపు 9 సినిమాల అనుభవమున్న చరణ్ మెగా అభిమానులనే కాదు సిని ప్రేక్షకులందరిని ఇంప్రెస్ చేసేలా ఈ ధ్రువ సినిమాలో తన నటన కనబరిచాడు. సో ఇదే కంటిన్యూ చేస్తే మెగా పవర్ స్టార్ పేరుకు తగ్గట్టే హిట్లు కూడా స్టార్ రేంజ్లో వచ్చి తీరుతాయి.