
పవన్ ఓ నిద్రపోతున్న అగ్ని పర్వతం అంటున్నాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఎప్పుడు నెగటివ్ కామెంట్స్ తో మెగా హీరోలను మెగాస్టార్ పవర్ స్టార్ లను కామెంట్ చేసే ఆర్జివి కొత్తగా పవన్ ఓ నిద్రపోతున్న అగ్నిపర్వతం టైం వచ్చినప్పుడు పేలతాడని ట్వీట్ చేశాడు. సడెన్ గా పవర్ స్టార్ స్టామినా గురించి వర్మ ఇచ్చిన క్లారిటీకి అందరు షాక్ అవుతున్నారు. మొదటినుండి మెగా అభిమానిని అని చెప్పుకుంటూ ఆ ఫ్యామిలీ హీరోలనే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆర్జివి ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకున్నాడు.
పవర్ స్టార్ గురించి నానా రచ్చ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ చేత వర్మ బాగానే ఇబ్బంది పడ్డాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్సెస్ వర్మ పోటాపోటీగా అప్పట్లో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత ఎప్పుడు ఆ రేంజ్ వాదన జరుగలేదు. ఇప్పుడు తనంతట తానే పవన్ కళ్యాన్ గురించి ఈ రేంజ్లో ట్వీట్ చేయడం అనేది గొప్ప విషయం. మరి దీనికి కారణాలు ఏమై ఉన్నా ఆర్జివిని ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వంతపడుతున్నారు.