అదో చీప్ వెబ్ సైట్.. మీరేం పట్టించుకోవద్దు

బుల్లితెర మీద నవ్వులు పండించే యాంకర్ లాస్య్ సడెన్ గా సీరియస్ అయ్యింది. కొద్దికాలంగా యాంకరింగ్ ఫాంలో లేని అమ్మడు ఇప్పుడు తన మీద వస్తున్న రూమర్స్ కు తలపట్టుకుంటుంది. కొద్దిరోజులు ఎఫైర్స్ అని.. మరికొద్దిరోజులు పెళ్లి అని ఇలా తనను టార్గెట్ చేస్తూ రాస్తున్న ఓ వెబ్ సైట్ ను టార్గెట్ చేసి లాస్య సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు తన ఫ్యాన్స్ కు తాను సంతోషంగానే ఉన్నానన్న మెసేజ్ పాస్ చేసింది.

మా టివి సంథింగ్ సంథింగ్ ప్రోగ్రాం తో రవితో రచ్చ చేసింది లాస్య. అప్పట్లోనే ఈ ఇద్దరి మధ్య నిజంగానే సంథింగ్ సంథింగ్ జరుగుతుందని అనుకున్నారంతా.. అయితే ఆ ప్రోగ్రాం ముదిరి పాకాన పడింది.. ఇక సడెన్ గా లాస్య బదులు కొత్త యాంకర్ శ్రీముఖి రంగంలోకి దిగింది. అప్పటి నుండి లాస్య కాస్త బ్యాక్ అయ్యింది. ఇక ఈ కారణాల చేతే అసలు తను ఏ ప్రోగ్రాం చేయలేకపోతుందని లాస్య మీద వార్తలు వచ్చాయి. ఇక ఓ వెబ్ సైట్ అయితే ఏకంగా లాస్య అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ రాసింది. 

ఇలానే ఉంటే తన మీద ఇంకా ఎలాంటి రూమర్స్ రాస్తారో అని లాస్య తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వీడియో మెసేజ్ పెట్టింది. తాను సూసైడ్ అటెంప్ట్ చేశాయంటూ రాసిన ఆ వెబ్ సైట్ ను చీల్చి చెండాడింది లాస్య. ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానని షోస్ కు కాస్త బ్రేక్ ఇచ్చానని అంతే తప్ప మరెలాంటి రీజన్ లేదు. త్వరలోనే ఓ కొత్త ప్రోగ్రాం తో మీముందుకొస్తా ఇలాంటి వెబ్ సైట్స్ రాసే చీప్ న్యూస్ మీరు నమ్మొద్దంటూ ఫైర్ అయ్యింది.