దేవినే ఫైనల్ చేసిన తారక్..!

జనతా గ్యారేజ్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్లో మూవీకి సిద్ధమవుతున్నాడు. సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ ముందు మ్యూజిక్ డైరక్టర్ గా తమిళ యువ సంగీత కెరటం అనిరుథ్ రవిచంద్రను అనుకున్నా అతన్ని కాదని ఫైనల్ గా దేవి శ్రీ ప్రసాద్ నే సెలెక్ట్ చేసుకున్నాడట. ఇప్పటికే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి కలిసి చేస్తున్నారు.

రాక్ స్టార్ దేవి మ్యూజిక్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన హుశారెత్తించే మ్యూజిక్ తో శ్రోతలను అలరించే దేవి శ్రీ ప్రసాద్ ఏ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందించాలో బాగా తెలుసు. చేసేది ట్రిపుల్ రోల్ ఈ సమయంలో అనిరుధ్ తో రిస్క్ ఎందుకని తారక్ మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేశాడు. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న తారక్ చాలా ఎక్సయింటింగ్ గా ఉన్నాడు.

జనతా గ్యారేజ్ హిట్ తో మరింత భాధ్యత మీద వేసుకున్న తారక్ ఆ హిట్ మేనియా కంటిన్యూ చేసేలా చూస్తున్నాడు. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అటు తన అన్న నిర్మాణ సంస్థకు భారీ హిట్ వచ్చేలా చేస్తుందేమో చూడాలి.