నాలుగు పాత్రల్లో అనుష్క..!

అక్కినేని నాగార్జున రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. హతిరాం బాబా బయోపిక్ తో వస్తున్న ఈ సినిమాలో అనుష్క కృష్ణమ్మ పాత్రలో నటిస్తుంది. సినిమాలో అనుష్కతో పాటుగా ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ లు కూడా నటిస్తున్నారు. సినిమాలో అనుష్క పాత్ర చిన్నదని అనుకున్నారు కాని ఇప్పుడు ఆమె పాత్ర చాలా పెద్దదని తెలుస్తుంది. అంతేకాదు అనుష్క నమో వెంకటేశాయలో నాలుగు పాత్రల్లో కనిపిస్తుందట.

అనుష్క నాలుగు క్యారక్టర్స్ ఏంటి అని ఆశ్చర్యపడొచ్చు. కృష్ణమ్మగా చేస్తూనే మరో మూడు పాత్రల్లో కూడా అనుష్కనే సెట్ చేశారట నాగార్జున రాఘవేంద్ర రావులు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సాయి కృప క్రియేషన్స్ లో మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 24న రిలీజ్ చేస్తుండగా ఆడియో జనవరి నెలలో పెట్టనున్నారు. 

ఇక సినిమాను మాత్రం ఫిబ్రవరి 10కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అసలైతే సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలని చూసినా ఇప్పటికే బాలకృష్ణ శాతకర్ణి, చిరంజీవి ఖైది నెంబర్ 150 సినిమాలు వస్తుండటంతో ఈ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు.