ధ్రువ 20 కోట్లు లాస్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా సక్సెస్ అయ్యింది. బ్రూస్ లీ తర్వాత రాం చరణ్ చూపించిన మేకోవర్ మెగా అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు నచ్చేసింది. అయితే ఇప్పటిదాకా 40 కోట్ల వరకే కలెక్ట్ చేసిన ఈ సినిమా అసలు అనుకున్న ముందు రిలీజ్ డేట్ కే వచ్చి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేది అని అంటున్నారు. ధ్రువ సినిమా ముందు టార్గెట్ దసరా అని అన్నారు.

అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాలేదో లేక షూటింగ్ కూడా పెండింగ్ ఉందో కాని దసరా సీజన్లో ఎక్కువ సినిమాలొస్తున్నాయ్ అని ఆ రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆ తర్వాత అనుకున్న డేట్ కూడా పోస్ట్ పోన్ అవడంతో చిన్నగా డిసెంబర్ 9న రిలీజ్ చేశారు. అప్పటికే నోట్ల రద్దుతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల బ్యాన్ ధ్రువ సినిమా మీద ఎంతో కొంత ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అది లెక్క చూస్తే దాదాపు ముందు రిలీజ్ అయ్యి ఉంటే 20 కోట్ల దాకా ఇంకా కలక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

మరి చెర్రి చేసిన తప్పిదం వల్ల సినిమా కలక్షన్స్ కు గండి పడటం జరిగింది. ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ కలక్షన్స్ అన్ని కలుపుని తెలుగులో కూడా మంచి హిట్ అనే సంగతి తెలుస్తున్నా దసరా సీజన్లో వచ్చుంటే మాత్రం కచ్చితంగా ఇంకా బాగా ఆడేదని అంటున్నారు.