హృతిక్ బలం కోసం మెగాస్టార్..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యామి గౌతంలు జతగా వస్తున్న సినిమా కాబిల్ సినిమా తెలుగులో బలం పేరుతో రిలీజ్ అవుతుంది. అంధత్వం ఉన్నా సరే సంతోషంగా జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి తన భార్యకు జరిగిన అన్యాయం మీద చేసే పోరాటమే ఈ కాబిల్ కథాంశం. హృతిక్, యామిలు ఇద్దరు బ్లైండ్ క్యారక్టర్స్ లో అదరగొట్టారు. కాబిల్ హింది ట్రైలర్ డిఫరెంట్ గా ఉండగా తెలుగు మాత్రం థ్రిల్లింగ్ గా ఉంది. హృతిక్ నటన హైలెట్ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో త్వరలో రిలీజ్ అవబోతుంది. 

ఇక ఈ సినిమా తెలుగు పబ్లిసిటీ కోసం మెగాస్టార్ ను వాడేస్తున్నారు. అవునండి నిజం సినిమాలో ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థావన వస్తుంది. నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను.. రోహన్ ఫ్రెండ్ ను.. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటూ చిరు వాయిస్ ను ఇమిటేట్ చేయించారు. నిజంగ చిరునే చేశాడా అన్న డౌట్ కూడా రాకమానదు. అయితే అదేదో మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్పినట్టు ఉంది. ఏది ఏమైనా తెలుగులో మార్కెట్ సంపాదించడం కోసం ఇక్కడి హీరోలను వాడేయాలని డిసైడ్ అయ్యారు బాలీవుడ్ హీరోలు.

రీసెంట్ గా దంగల్ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఆమిర్ ఖాన్ తనకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో నటించాలని ఉందని చెప్పాడు. సో ఇక్కడ సినిమాలను రిలీజ్ చేసేప్పుడు ఇక్కడ స్టార్స్ ను వాడటం మాములు విషయమే కదా.. ఇదంతా ఇక్కడ వారి ఫ్యాన్స్ ను టార్గెట్ చేయడమే అని అంటున్నారు.