రాజమౌళి మాటలకు ఆర్జివి షాక్..!

శివ టు వంగవీటి ఆర్జివి సిని ప్రస్థానంలో టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరక్టర్స్ అందరు పాల్గొన్నారు. తన దగ్గర దర్శకత్వం చేసిన వారే కాదు టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ రాజమౌళి, బోయపాటి శ్రీను లాంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆర్జివి గురించి రాజమౌళి చెబుతూ శివ ఎంతోమంది దర్శకులకు స్పూర్తి కలిగించిన సినిమా వర్మ తీసిన శివ, రంగీలా, సత్య, కంపెనీ ఈ సినిమాలన్ని గొప్ప సినిమాలు. అయితే ఈ క్రమంలో ఐస్ క్రీం, అడవి లాంటి సినిమాలు తీయడం ఎందుకని ప్రశ్నించారు. 

ఇక అదే విషయాన్ని ఆర్జివి దగ్గర ప్రస్థావిస్తే మాత్రం తన తీసిన హిట్ సినిమాలన్ని యాక్సిడెంటల్ గా వచ్చినవి.. ఫ్లాపులన్ని కావాల్సి చేసినవి అంటారట. ఆయన ట్వీట్స్ లానే ఆయన ఏమంటున్నారన్నది అర్ధమయ్యి చావదని అన్నారు రాజమౌళి. వంగవీటి సినిమాకు వర్మ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే ఆర్జివి ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉంది. ఆయన ఇలానే గొప్ప సినిమాలు తీయాలని అన్నాడు జక్కన్న.

వంగవీటి సినిమా గురించి చెబుతూ సినిమా పోస్టర్స్ ట్రైలర్ చూస్తుంటే అప్పట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ పేపర్లో చూసినట్టుగానే ఉంది. టీం అందరికి తన విశెష తెలిపిన రాజమౌళి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అన్నారు.