
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్ట్ చేస్తున్న క్రిష్ తన టాలెంట్ ఏంటో అందరికి చూపించాడు. ట్రైలర్ లోనే ఇదో అద్భుతం అనిపించేలా చేసిన క్రిష్ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాడని అంటున్నారు. ఇక పరిశ్రమలో ఎవరైనా హిట్ కొడితే వారికి వెంటనే ఛాన్స్ ఇచ్చే యంగ్ టైగర్ ఇప్పుడు క్రిష్ మీద కన్నేశాడట. టీజర్ టైంలోనే క్రిష్ చేత సంభాషణలు జరిపిన తారక్ ట్రైలర్ కూడా తన ఇంప్రెషన్ కొట్టేయడంతో ఇక తనతో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్నో కథలని విని బాబి డైరక్షన్లో సినిమా ఓకే చేసిన తారక్ తర్వాత సినిమాను క్రిష్ తోనే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట. గమ్యం నుండి రాబోయే శాతకర్ణి సినిమా దాకా క్రిష్ తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల మనసునే కాదు స్టార్ హీరోలను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శాతకర్ణి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన తర్వాత తన తర్వాత సినిమా నిర్ణయించుకునే అవకాశం ఉంది.
శాతకర్ణి హిట్ అయితే కనుక క్రిష్ డైరక్షన్లో చేసేందుకు స్టార్స్ కూడా క్యూ కట్టేయడం ఖాయం. మొన్నటిదాకా కుర్ర హీరోలతో సినిమాలు చేసిన క్రిష్ ఇప్పుడు సడెన్ గా స్టార్ హీరోల రేసులో ఉన్నాడు.