పర్సనల్ స్టాఫ్ మొత్తం మార్చేసిందట..!

మొన్నటిదాకా స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న సమంత నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధం అని తెలియగానే వచ్చిన సినిమా ఆఫర్లు కూడా వెనక్కిపోతున్నాయి. ఇక మరి ఈ కోపంతోనో లేక ఏమోగాని తన పర్సనల్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేసిందట సమంత. కెరియర్ మొదలు పెట్టిన నాటి నుండి ఒకే స్టాఫ్ ను మెయింటైన్ చేస్తున్న సమంత ఇన్నేళ్లుగా రాని తేడా ఎక్కడ వచ్చిందో ఏమో కాని సడెన్ గా అందరిని పనిలోంచి తీసేన్సిందట. తనకు చాలా ఇంపార్టెంట్ అయిన సమంత ఓ రింగ్ ఈమధ్య మిస్ అయ్యిందట. అది తన దగ్గరున్న స్టాఫ్ నిర్వాకమే అని తెలిసి వారిపై ఈ విధంగా తన కోపం తీర్చుకుంది.

కారణం ఏదైనా ఇన్నేళ్లుగా తన సినిమా విషయాలను డేట్స్ సెట్స్ చేసుకున్న సమంత టీం ఇప్పుడు లేదట. ఇక ఇప్పుడు తన దగ్గర అంతా కొత్త వారిని చేర్చుకుందట. రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న సమంత తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు కాని కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఒకటి.. విశాల్ తో ఒక సినిమా చేస్తుంది. తెలుగులో మాత్రం వచ్చిన సావిత్రి బయోపిక్ ను కూడా కాదనేసిందట. మరి మ్యారేజ్ ముందే ఈ రేంజ్ చేంజ్ వచ్చిన సమంత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకెలా మారనుందో అని అందరు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్స్ లో ఇప్పటివరకు సమంత చేసిన మంచి పనులు అందరికి తెలిసినవే.. మరి ఆ పేరుని అమ్మడు చెడగొట్టుకోకుండా ఉంటే చాలు.