చుక్కలు చూపిస్తున్న టాప్ హీరోయిన్..?

ఓ స్టార్ హీరోయిన్ తనయురాలైన ఆమె టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన రెండు మూడు సినిమాల దాకా ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. అయితే ఎలాగోలా ఓ స్టార్ హీరో సినిమాతో అమ్మడికి హిట్ రాగా అక్కడి నుండి ఆమె దశ తిరిగిపోయింది. తెలుగు తమిళంలో సూపర్ క్రేజ్ సంపాదించిన ఆ హీరోయిన్ తెలుగు సినిమాల మీద కాసింత చిన్న చూపు చూస్తుంది అన్నది ఎప్పటినుండో వినిపిస్తున్న మాటే. ఇక్కడ సినిమాలను చాలా లైట్ తీసుకున్న అమ్మడు కమిట్ అయిన సినిమాలు కూడా సరిగా చేయడంలేదట.

ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్న ఆమె మార్నింగ్ షూటింగ్స్ కు లేట్ గా వస్తుందట. అంతేనా నైట్ మొత్తం ఓ కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకు తిరిగి రచ్చ రచ్చ చేస్తుందట. చేసేది స్టార్ సినిమా అతనికి టైం చాలా వాల్యుబుల్ కాని అమ్మడి వ్యవహారంతో విసిగిపోయి ఏం చేయాలో తోచలేకున్నాడట ఆ హీరో. ఇప్పటికే ఆమె ప్రవర్తన నచ్చక కమిట్ అయిన సినిమాలనే క్యాన్సిల్ చేశారు దర్శక నిర్మాతలు. మరి ఇలానే కంటిన్యూ అయితే ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం కూడా కష్టమే అంటున్నారు సిని ప్రముఖులు.