అరవింద్ స్వామికి షాక్ ఇచ్చిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మురుగదాస్ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చూస్తున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. కొరటాల శివ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించేందుకు గాను తమిళ హీరో కం విలన్ అరవింద్ స్వామిని సంప్రదించారట . ప్రస్తుతం హీరో నుండి విలన్ గా టర్న్ అయిన అరవింద్ స్వామి 3 కోట్లు ఇస్తేనే కాని సినిమా చేస్తా అంటున్నాడట. 

నిన్న మొన్నటిదాకా కోటి కోటిన్నర తీసుకున్న అరవింద్ స్వామి తెలుగులో కూడా ధ్రువ హిట్ అయ్యే సరికి ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ చేశాడట. అరవింద్ స్వామి ఇచ్చిన రెమ్యునరేషన్ షాక్ కు మహేష్ కూడా అదే తరహాలో రెస్పాన్స్ ఇచ్చాడట. అంత రేంజ్లో ఉంటే మాత్రం తను అవసరం లేదని కొరటాల శివతో చెప్పాడట. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో శ్రీమంతుడు హిట్ అందుకోగా మరోసారి అలాంటి మ్యాజిక్ వర్క్ అవుట్ చేసేందుకు వస్తున్నారు శివ మహేష్. 

ఇక సినిమాలో మహేష్ సి.ఎంగా కనిపిస్తాడని టాక్.. ఇప్పటికైతే భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉంది అయితే వినిపిస్తున్న ఈ టైటిల్ అవునని గాని కాదని కాని చిత్రయూనిట్ డిక్లేర్ చేయకపోవడంతో దాదాపు ఈ టైటిల్ కన్ఫాం అనేస్తున్నారు.