వర్మకు గెస్ట్ లుగా ప్రభాస్ రాజమౌళి..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. తను తీసిన ఇన్ని సినిమాల కన్నా వర్మ ఈ వంగవీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం ముందునుండి చూస్తూనే ఉన్నాం. తనకు తానుగా ఇది తనకు ఇష్టమైన ప్రాజెక్ట్ అని అన్నాడు కూడా. అయితే ఈ నెల 20న అనగా రేపు వర్మ సినిమా ప్రస్థానానికి సంబందించి శివ టూ వంగవీటి అనే స్పెషల్ ఈవెంట్ జరుగబోతుంది. వర్మతో పనిచేసిన టీం అంతా ఈ ఈవెంట్ కు వస్తారట. అంతేకాదు అక్కినేని నాగార్జున. పూరి జగన్నాథ్, కృష్ణవంశీలు కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది.

అయితే ఈ ఈవెంట్ కు స్పెషల్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా దర్శక ధీరుడు రాజమౌళి కూడా వస్తారని టాక్. ప్రభాస్ రాజమౌళిలకు ఇన్విటేషన్ పంపించాడట వర్మ. సో ఈవెంట్ కు ఆ ఇద్దరు కూడా వస్తున్నారని టాక్. వర్మ రాజమౌళి ఒకే స్టేజ్ మీద ఓ విధంగా తెలుగు ప్రేక్షకులకు ఇదో అరుదైన సన్నివేశం అని చెప్పొచ్చు. ఇక అదే స్టేజ్ మీద పూరి, కృష్ణవంశీ కూడా ఉండటం విశేషం. మరి ఈ ఈవెంట్ లో వర్మ గురించి ప్రముఖులు ఏం మాట్లాడతారు అన్న దాని మీదే అందరి దృష్టి ఉంది.

ఇక ఈ ఈవెంట్ ను కూడా వర్మ తన లేటెస్ట్ మూవీ వంగవీటికి పబ్లిసిటీకి ఉపయోపడేలా వాడుకుంటున్నాడట. 23న రిలీజ్ అవుతున్న వంగవీటి మూవీ వర్మకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.