
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాలో కేవలం మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రమే కనిపించే అవకాశాలు ఉన్నాయట. మెగా హీరోలందరు ఈ సినిమాలో సర్ ప్రైజ్ ఇస్తారంటూ వస్తున్న వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే. 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమాగా ఖైది ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ రికార్డ్ వ్యూయర్ కౌట్ సాధించింది. ఇక సినిమాలో మెగా హీరోలు కనిపిస్తారన్న విషయంపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.
చెర్రి మాత్రమే ఖైదిలో మెరుస్తాడట అది కూడా ఓ సాంగ్ లో అలా వచ్చి ఇలా వెళ్తాడట. చరణ్ పోర్షన్ మొత్తం కలిపినా 30 సెకన్స్ మించి ఉండట. అలా మెగాస్టార్ మెగా పవర్ స్టార్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నారు. మగధీర లో బంగారు కోడిపెట్ట సాంగ్ లో సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు ఇప్పుడు తన సినిమాలో తనయుడికి ఛాన్స్ ఇస్తున్నాడు. ముందు మెగా హీరోలంతా ఈ సాంగ్లో కనిపిస్తారని టాక్ వచ్చినా పవర్ స్టార్ రాకుండా వీరే కనబడితే మళ్లీ అదో కొత్త ప్రాబ్లెం తెచ్చిపెడుతుందని ఎవరిని కాకుండా కేవలం చెర్రితోనే కానిచ్చేస్తున్నాడు చిరంజీవి.
చిరు అడిగితే పవన్ కాదంటాడా అంటే ఒకవేళ సినిమా రిజల్ట్ అటు ఇటు అయినా మెగా ఫ్యామిలీ మొత్తం పరువు పోయే అవకాశం ఉంది. అందుకే చిరు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఈ నెల 29న సెన్సార్ కంప్లీట్ చేసుకోబోతున్న ఖైది మూవీ జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. ఇక ఆడియో ఎలాగు డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు.